MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:47 pm Posted by : MANA TOLIVELUGU

కాసోజు శ్రీకాంతాచారిని స్మరించుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ :

భువనగిరి పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మోత్కూర్ మండల పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పొడిచేడు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి, రాష్ట్ర బీసీ మహిళా కమిషనర్‌ కాసోజు శంకరమ్మతో కలిసి ఎంపీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమానికి తన ప్రాణత్యాగంతో ఊపిరి పోసిన మహనీయుడు కాసోజు శ్రీకాంతాచారి అని, ఆయన త్యాగం ఎప్పటికీ స్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.